Sunday, June 4, 2017

46.ఇతర స్వరూపముల గురించి....... ( శరీరమీ .... వాత , పిత్త , కఫములు )

జై గోమాత ...... జై జై విశ్వమాత ( 46 )

ఇతర స్వరూపముల గురించి.......
( శరీరమీ .... వాత , పిత్త , కఫములు )

       మనము భోజనం చేసిన ఆహారము నేరుగా జీర్ణకోశానికి చేరుతుంది . జీర్ణకోశంలో కఫం యొక్క ప్రాధాన్యం ఉంటుంది . అదే ఆహారం చిన్న ప్రేగులలోకి వెళ్ళినప్పుడు రసంగా మారుతుంది .  చిన్నప్రేగులలో పిత్తము యొక్క ప్రాధాన్యత యొక్క ఉంటుంది . అదే పెద్ద ప్రేగులను చేరుకునే సరికి దానిలో ఉన్న రసమంతా తొలగి పోతుంది . పెద్ద ప్రేగులలో వాతానికి ప్రాధాన్యత ఉంటుంది .

      ఊపిరి తిత్తులలో కఫానికి ప్రాధాన్యత ఉంటుంది . మన ఊపిరిలోని ఆక్సిజన్ రక్తంలోకి కలిసి పోతుంది . రక్తంలో పిత్తానికి ప్రాధాన్యత ఉంటుంది . అందువలన రక్తానికి సంబంధించిన వ్యాధులన్నీ పిత్తానికి చెందినవే . మొలల వ్యాధి , రక్తస్రావమైనా , పుండ్లు లేక కురుపులు మొదలగునవి రక్తానికి చెందిన సమస్యలన్నీ పిత్తానికి చెందిన రోగాలు. చివరగా రక్తం గుండెకు చేరుకుంటుంది . అందుకే గుండెకు వాతానికి సంబంధం ఉంటుంది .

      ఉదయం పూట కఫానికి ప్రాధాన్యం ఉంటుంది . మధ్యాహ్నం పిత్తము , రాత్రి మొదలైనపుడు కఫం , అర్ధరాత్రి పిత్తము , రాత్రి ముగుస్తున్న సమయంలో వాతానికి ప్రాధాన్యత ఉంటుంది . మీకు ఏ సమయంలో సమస్య వస్తుంది అన్న దానిని బట్టి మీరు నిర్ణయించ వచ్చును . మీకు మిట్ట మధ్యాహ్నం సమస్య వుంది అంటే అది మీకు పిత్తానికి సంబందించిన సమస్యగా గుర్తించండి . మీకు సాయంత్రం లేక రాత్రి ముగిసేటప్పుడు 4 - 5 గంటలలో సమస్య వస్తున్నా అది వాతానికి చెందిన సమస్య అని గుర్తించండి లేక పగలు ప్రారంభం అవుతున్నప్పుడు కానీ లేదా రాత్రి మొదలవుతున్నప్పుడు కానీ సమస్య వస్తుంటే అది కఫానికి చెందిన సమస్యగా గుర్తించండి .

          ' హరే కృష్ణ '

               శ్రీ ఉత్తమ్ మహేశ్వరి .

Collected and typed by: Ram Prasad Gaaru








Be unite to say:"JAI JAVAAN-JAI KISAAN-JAI GOMAATHA"




Vishnu@Goseva world

No comments: