Sunday, June 4, 2017

47.ఇతర స్వరూపముల గురించి * ....... ( వర్షాకాలం )

*జై గోమాత ...... జై జై విశ్వమాత ( 47 )*

* ఇతర స్వరూపముల గురించి * .......
( వర్షాకాలం )

      ఉదయం 4 - 5 గంటల మధ్యలోనే హార్ట్ ఎటాక్ లు వస్తూ ఉంటాయి . అది వాతానికి చెందిన రోగం కనుక వాతానికి చెందిన సమయంలో ఎక్కువ సమస్యను కలిగిస్తుంది . రోజంతా శ్రమించినా రాత్రికి గుండె నొప్పిరాదు . రాత్రిలో చివరి జాము వేళలోనే గుండె నొప్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయి .

      భయంకరమైన కలలు వస్తూ ఉంటే మీకు పిత్తం ప్రధానమని అర్ధం . కలలో ఎవరితోనైనా పోరాడుతుంటే మీ శరీరంలో పిత్తము పెరుగుతున్నదని అర్ధం . కలలను బట్టి మనము ఏ ప్రకృతికి చెందిన వారమని తెలుసు కోవచ్చును .

      భారీ వర్షం పడుతూవుంటే మన ఇళ్ళలో పకోడిలి చేస్తారు . వర్షం పడటంతోటే ఉష్ణోగ్రత ఒక్క సారిగా 10 - 15 డిగ్రీలు తగ్గిపోతుంది . అంతా తేమ అలుముకుంటుంది . అపుడు శరీరంలో వాతం పెరుగుతుంది . నూనెలో వేయించిన పదార్ధాలను తీసుకోవటం వలన శరీరమంతటికీ అయిలింగ్ జరుగుతుంది . మనం వర్షబుతువులో వచ్చే వైరల్ ఇన్ ఫెక్షన్ నుంచి సంరక్షించుకోగలుగుతాం . వర్షాకాలంలో పకోడిలు తినడం ఆరోగ్యానికి ఎంతోమంచిది . మనం ఏవిధమైన రిఫైండ్ నూన్ ని వాడకూడదు . రిఫైండ్ నూనె ఆరోగ్యానికి మంచిది కాదు . శుద్ధమైన నూన్ ( నాన్ రిఫైండ్ ) ఆరోగ్యానికి మంచిది . మరియు ఉల్లిపాయ పకోడి తినకూడదు . ఉల్లిపాయ వాతాన్ని పెంచుతుంది .

      ఆశ్వీయుజ మాసంలో పితృ పక్షంలో పెద్దలకు పెట్టే శ్రాద్ధంలో ప్రధానంగా పాయసం చేస్తాము . శరదృతువులో వర్షాలు ఆగిపోయి వేడిబాగా పెరుగుతుంది . వేడి వలన పైత్యం పెరుగుతుంది . పాయసం తీసుకోవడం వలన పైత్యం తగ్గుతుంది .

           * " హరే కృష్ణ " *
         
                    * శ్రీ ఉత్తమ్ మహేశ్వరి *

Collected and typed by: Ram Prasad Gaaru








Be unite to say:"JAI JAVAAN-JAI KISAAN-JAI GOMAATHA"




Vishnu@Goseva world

No comments: