Saturday, June 3, 2017

5.గోసేవ వరల్డ్ అందరి కోసం ఎందుకు..

గోసేవ వరల్డ్ అందరి కోసం ఎందుకు..
*******************************************
మేము సైతం పాడి-పంటల-రైతు కోసం అంటే అందరి కోసం…

గోవు మనతో మాట్లాడితే...?
******************************
మన దేశము వ్యవసాయ దేశము,పాడికి అవసరమయ్యే మేము(ఆవులు)  మీ మతాన్ని గానీ కులాన్ని గానీ చూసి పాలని ఇవ్వము.మమ్మల్నీ ఆదరించే వారికీ,ప్రేమించే వారికి మాత్రమే కాదు మమ్మల్ని విమర్శ చేసేవారికి మరియు కసాయికి సైతం కూడా మా పాల ఉత్పత్తులు లేకుండా రోజు గడవదు.మేము మనుషులకూ(చిన్నవారైనా-పెద్దవారైనా, ధనవంతులైన-పేద వారైనా, మంచివారైనా-చెడ్డవారైనా ,సంతోషముతో ఉన్నా-భాధలో ఉన్న ,ఏ వృత్తి వారైనా ,ఏ భాష వారైనా,గెలుపు లో ఉన్న-ఓటమి లో ఉన్నా),దేవతలకు,అందరికీ మేమే ఆధారము.ఆలాగే వ్యవసాయానికి నిత్యం ఉపయోగపడే ఎద్దులు కూడా అంతే!

దేశానికి అన్నము పెట్టె రైతు అంతే. దేశానికి తన ప్రాణాలను పణంగా పెట్టి రక్షణ కల్పించే సైనికుడు కూడా అంతే, సైనికుడికి కూడా అన్నము పెట్టేది మన ఒక రైతు మాత్రమే!మానవ తప్పిదాల వల్ల పాడి పంటలకు, రైతుకు ఈ దుస్థితి.


మనిషికి అక్కరలేనిది తిని నిత్యం అందరికీ ఉపయోగపడే గోవుని గౌరవిద్దాం.రండి చేయి చేయి కలపండి.మొత్తం గోసంపదని గోసేవ వరల్డ్ ద్వారా కాపాడుకుందాము. ఆవులని కాపాడటం అంటే కూడా దేశాన్ని కాపాడటమే.


గోసేవ వరల్డ్ ప్రోజెక్ట్ ప్లాన్ అంటే ఉద్యోగాలని,ఆరోగ్యాన్ని,చక్కటి పర్యావరణన్ని,విద్య,భద్రత, అపారమైన సంపదను,కల్తీ లేని సమాజన్ని మనకు మన పిల్లలకు మనదేశానికి నెలకోల్పుదాము.ఇది మన ద్వారా సాద్యం.ఈ రోజుల్లో గోవులకు జరిగే అన్యాయం పట్ల చిన్నవారి నుండి గోప్పవారి వరకు ప్రతిఒక్కరికి ఆందోళన కలిగించే సమస్య.

ఈ సమస్య కు పరిష్కారం గోసేవ వరల్డ్ ప్రోజెక్ట్ ప్లాన్ తొ సాధ్యం అవుతుంది.ఇది సామాన్యుడి నుండి వచ్చిన అసామన్యమైన ఆలోచన.గోసేవ వరల్డ్ (విలువలపట్ల దయచూపి నిలబెట్టు).

****జై జవాన్ -జై కిసాన్-జై గోమాత***ఆవు మన అందరిది అని అందాము\ చెబుదాం****

No comments: