Monday, June 5, 2017

7.మనం వాగ్భటాచార్యుని సూత్రాలను క్లుప్తంగా..మన ఆరోగ్యం

🍀 మన ఆరోగ్యం -- మనచేతుల్లో( 7) 🌷

      మనం వాగ్భటాచార్యుని సూత్రాలను క్లుప్తంగా తెలుసుకుందాం. వీటిలో మొదటి సూత్రం మనం వండుకునే ఆహారం గాలి , వెలుతురు పడేలాగ చూసుకోవాలి. ప్రెషర్ కుక్కర్ , మైక్రోవోవెన్ , ఫ్రిజ్ లాంటి వాటిల్లో గాలి వెలుతురూ ప్రవేశించవు గనుక వాటిని వాడకూడదు. ఇక రెండవ సూత్రం , ఆహార పదార్ధాన్ని వండిన 48 నిమిషాలలోపే తినేయవలెను, మిగల్చకూడదు. మూడవ సూత్రం వంటకు ఉపయేగించే పిండి , మొక్క జొన్న పిండి , జొన్నల పిండి వగైరా 7 రోజులలోపే వండుకోవాలి. గోధమ పిండి అయితే 15 రోజుల లోపు మాత్రమే వండుకోవాలి. ఇది తిరగలి తెచ్చుకుని మనమే పిండి తయారు చేసుకున్నప్పుడే సాధ్యపడుతుంది.

ఇక నాల్గవసూత్రం మనిషి 60 సంవత్సరాల వరకు శారీరక శ్రమ చేస్తూండాలి. తర్వాత నుండి క్రమంగా విశ్రాంతి తీసుకోవటం మంచిది. ఐదవ సూత్రం మనం నివసించే పరిస్థితులు అంటే భౌగోళికంగా వాతావరణ స్ధితిగతులను అనుసరించి జీవించాలి. మన భారత దేశం ఉష్ణప్రదేశం. మనకి సహజంగా వాతప్రకోపం. పిత్తం, కఫము తక్కువగా ఉంటాయి. కనుక, ఇక్కడి వారికి 80 % వాత సంబంధిత వ్యాధులు ఎక్కువగా వస్తాయి. కనుక మనం దినచర్యలో వాతం పెరగకుండా చేసుకోవాలి. ఉదాహరణకి, ఈ మధ్య చాలా మంది ప్రోద్దున్నే పరిగెత్తడం అలవాటు. ఇది తప్పు. మనం ఎక్కువగా పరిగెత్తితే వాతం ప్రకోపిస్తుంది. ఎందుకంటే మన వాతావరణం పరిగెత్తటానికి అనుకూలం కాదు. చక్కగా నడవండి. పరిగెత్తకండి.

      వాగ్భటాచార్యుని సూత్రం ప్రకారం భారతదేశం ఉష్ణప్రదేశం. వాయువు వేడిగా ఉంటుంది. కాబట్టి వాతం పెరగకుండా చూసుకోవాలి. కెనడా, అమెరికా లాంటివి కఫ ప్రదేశం కనుక వారు కఫ ప్రభావానికి గురికాకుండా చూసుకోవాలి. ఇక పిత్తం సర్వ సాధారణంగా సమంగానే ఉంటుంది. ఇవి ముఖ్యమైన ఇదుసూత్రాలు.

 🌺 ఆరోగ్యమే --- మహాభాగ్యం

 ......శ్రీ రాజీవ్ దీక్షిత్ ......🌺


Collected and typed by: Ram Prasad Gaaru








Loving-Serving-Saving Cow-Bull (Nature asset) is nothing wrong

Vishnu@Goseva world 

No comments: