Monday, June 5, 2017

29.వాతము దాని స్వరూపం ( పెళ్ళి తరువాత ) గురించి .....

జై గోమాత .... జై జై విశ్వమాత . ( 29 )

వాతము దాని స్వరూపం ( పెళ్ళి తరువాత ) గురించి .....

      వివాహమనేది పురుషుల , స్త్రీల జీవితంలో ఒక పరివర్తన ( మార్పు ) అవుతుంది . ఈ పెళ్ళి అనే పెద్ద పరివర్తన జరిగిన తరువాత 40 రోజుల వరకు దంపతులిద్దరు కూల్ డ్రింక్ త్రాగరాదు . చల్లటి ఐస్ క్రీమ్ తినకూడదు .

      ఒక వేళ వాళ్ళు చల్లటి పదార్ధాలు తీసుకొన్న యెడల వాతం పెరుగుతుంది . ఎందుకంటే వాతములో శుష్కింపచేసే గుణం , పొడిబారేటట్లు చేసే గుణం , మృదుత్వాని తొలగింప చేసే గుణం వుంది . వాతానికి మనసుతో సంబంధం ఉంది . వాతము మనసు యొక్క సున్నితత్వాన్ని తొలగించి కాఠిన్యాన్ని పెంచుతుంది . కాబట్టి మనస్సు కఠినంగా తయారవుతుంది . అలా కావడం వలన సర్దుకు పోవడం అనేది జరుగదు . భార్యా భర్తలు ఇరువురూ కాఠిన్యంతో కూడుకుని ఉంటారు . ఇద్దరికి సర్దుకు పోయే భావం ఉండదు. గొడవలు మొదలవుతాయి . అమ్మాయి అత్తవారింట్లో అనుకూలంగా ఉండలేక పోతుంది . క్రమక్రమంగా గొడవలు పెరిగి విడాకుల వరకు వస్తారు .

      అందు వలన వారికి కావలసినవి శోషింప చేసే ఆహారం కాదు . వారికి కావలసినది స్నేహ పూర్వకమైన , స్నిగ్ధ పూర్వకరమైన ఆహార పదార్థాలు . ఆ సమయంలో ఆవు నెయ్యితో కూడిన భోజనం , మధురమైన తియ్యని ఆహార పదార్ధాలు ఉండాలి .

         ప్రస్తుతం యువతీ యువకులు ఎండిపోయిన భేల్ పూరీలు , మైదాపిండితో తయారు చెయ్యబడిన పాచిపోయిన పిజ్జాలను తింటూ ఉంటారు . ఇటువంటివి అన్నీ తిని అనేక సమస్యలన్నీ తెచ్చుకుంటారు . కాల క్రమేణ అవి మరింత తీవ్ర రూపం దాల్చుతాయి .

      వివాహము అయిన తరువాత 40 రోజుల వరకూ చల్లటి పదార్థాలు తీసూకోకూడదు. ఎండి పోయిన , ఆరిపోయిన ఆహార పదార్ధాలు తీసుకోకూడదు .

              ' హరే కృష్ణ '

                శ్రీ ఉత్తమ్ మహేశ్వరి .

Collected and typed by: Ram Prasad Gaaru








Be unite to say:"JAI JAVAAN-JAI KISAAN-JAI GOMAATHA"




Vishnu@Goseva world

No comments: