Sunday, July 9, 2017

49.ఉదయం అల్పాహారం తీసుకొనకూడదు ఎందుకు ?

మన ఆరోగ్యం ..... మన చేతుల్లో ( 49 )

ఉదయం అల్పాహారం తీసుకొనకూడదు ఎందుకు ?

      మనం ఉదయం అల్పాహారం మానివేసి కడుపు నిండా భోజనం చేద్దాం. ఉదయం అల్పాహారం తినే అలవాటు భారతీయులది కాదు , ఆంగ్లేయులది. వారికి ఉదయం అల్పాహారమే మంచిది. ఎందుకంటే పాశ్చాత్య దేశాల్లో వారికి సంవత్సరంలో 7 , 8 నెలలపాటు సూర్యోదయమే ఉండదు. జఠరాగ్నికి సూటిగా సూర్యునితో సంబంధం ఉంది. సూర్యుడు ఉదయించేటప్పుడు జఠరాగ్ని ప్రదీప్తమవుతుంది. సూర్యుడు అస్తమించడానికి వస్తున్నప్పుడు అగ్ని కూడా తగ్గతూ వుంటుంది. యూరప్ , అమెరికా లాంటి చోట్ల ఎక్కువ కాలం మంచు కురుస్తూ వుంటుంది. సూర్యోదయమే అవ్వదు. కనుక వారి జఠరాగ్ని తక్కువగా ఉండటం కారణంగా వారు ఉదయం ఆహారం ఎక్కువగా తీసుకోలేరు. కాదని ఎక్కువ ఆహారం ఉదయం తీసుకుంటే వారికి ఎన్నో సమస్యలు వస్తాయి. కనుక ఎవరైనా వారు ఉన్న ప్రదేశాన్ని బట్టి వారికున్న వాతావరణ స్ధితులనుబట్టి అక్కడి నియమాలనే అనుసరించాలి.

      సాయంకాలం భోజనం సూర్యాస్తమయానికి 40 నిముషాల ముందుగా భోజనం చేయ్యాలి. అంటే మన ప్రాంతంలో 6 గం !! లకు సూర్యాస్తమయం అయ్యేటట్లయితే అప్పుడు మనం 5 గంటల 20 నిమిషాల సమయంలో ఆహారం తీసుకుని ముగించాలి.

      రాత్రి పూట ఏదైన తీసుకోవాలనిపిస్తే అది కేవలం పాలు మాత్రమే ఉత్థమమైన ఆహారం.

       డయాబెటిస్ , ఆస్తమా , ఇంకా వాతపు సమస్యలు ఉన్న ఎవరైన ఇలా ఆహార నియమాన్ని పాటించండి రోగ విముక్తులు కండి. అలాగే అందరూ ఈ నియమాన్ని పాటించి సంపూర్ణ ఆరోగ్యంగా జీవించండి.

       మనదేశంలో ప్రతి రోజూ సూర్యుడు ఉదయిస్తాడు. కనుక మనకి ప్రతి ఉదయం శుభోదయమే , ప్రతి మార్నింగ్ గుడ్ మార్నింగ్.

      యూరప్ వారు మాత్రం సూర్యుని కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వారికి మార్నింగ్ గుడ్గా ఉండదు. కనుక వారు ప్రతివారికి విష్యస్ చేసుకుంటూ ఉంటారు. అందుకే వారికి ఈ గుడ్ మార్నింగ్ విష్యస్ అవసరం.

      ఈ గుడ్ మార్నింగ్ లో ఎందుకు చిక్కుకున్నాము. మనం ఈ చిక్కల్లో నుంచి బయటకు వద్దాము. నమస్కారం అని చెప్పుకుందాం.

     " ఆరోగ్యమే .....మహాభాగ్యం "

               శ్రీ రాజీవ్ దీక్షిత్.

Collected and typed by: Ram Prasad Gaaru



Loving-Serving-Saving Cow-Bull (Nature asset) is nothing wrong
Vishnu@Goseva world 

No comments: