Sunday, July 9, 2017

51.కాల్షియం గురించి ......

మన ఆరోగ్యం .... మన చేతుల్లో ( 51 )

కాల్షియం  గురించి ......

      శరీరంలో కాల్షియం తగ్గితే 50 పైగా జబ్బులు వచ్చే అవకాశం ఉన్నది. శరీరంలో కాల్షియం తగ్గితే ఎక్కువగా ఎముకలకి సంబంధించిన నొప్పులు , రక్తానికి , కఫానికి సంబంధించిన రోగాలు వస్తాయి. శరీరంలో కాల్షియం ఉండటం వల్లనే మిగతా పోషకాలన్నీ ఉపయోగపడతాయి. ఇది ఎన్నో సంవత్సరాల ప్రయోగ ఫలితంగా చెప్పబడింది. మీ శరీరంలో ఏ విటమిన్ అయినా తెలియబడాలంటే ముఖ్యంగా కాల్షియం ఉండాలి.

      మన శరీరంలో 40 నుంచి 45 సంవత్సరాల వయసు వరకే మనం స్వీకరించే ఆహారంలో నుంచి కాల్షియం తయారవుతుంది. కాల్షియం ఎక్కువగా ఉండే పదార్థం పాలు , తర్వాత పెరుగు , తర్వాత మజ్జిగ , తర్వాత వెన్న , తర్వాత నెయ్యి . వీటిన్నింటిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇంకా నారింజ , కమలా , బత్తాయి , ద్రాక్ష వంటి పుల్లటి ఫలాలలో కూడా కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అలాగే మామిడి పండులో కూడా ఉంటుంది. ఎక్కువగా కాల్షియం ఉండే పండు అరటి పండు. అరటి పండు కాల్షియం యొక్క భాండాగారం. ఈ పండ్లలోని కాల్షియం మనకు 40  నుంచి 45 సంవత్సరాల వరకే తయారవుతుంది.

      45 సంవత్సరాలు పూర్తి కాగానే మఖ్యంగా స్త్రీలకు నెలసరలు ఆగిపోయిన తర్వాత శరీరం కాల్షియంను తీసుకునే సామర్ధ్యం కోల్పోతుంది.  ఎంతగా మీరు పండ్లు తీసుకున్నప్పటికీ కాల్షియం ను జీర్ణం చేసే హార్మోన్ల ఉత్పత్తి ఆగిపోతుంది. అప్పుడు కాల్షియం జీర్ణం కావడం చాలా కష్టమవుతుంది. అప్పుడు మీరు కాల్షియంను బయటనుండి తీసుకోవలసి ఉంటుంది. 45 సంవత్సరాల తర్వాత స్త్రీలు గాని పురుషులు గాని తప్పకుండా సున్నం తీసుకోవలెను.

      సున్నంను పండ్ల రసాలలో గాని , పెరుగులోగాని , మజ్జిగలోగాని , పప్పులో గాని కలిపి , వేడి నీళ్ళలో గాని , తమలపాకులో గాని కలిపి ప్రతి రోజు తీసుకొనవలెను.
       ఇంకా సున్నం పెరుగుతోగానీ , మజ్జిగతో కలిపి లేదా వేడి నీటితో కలిపి 1 గ్రాము సున్నం తీసుకుంటే అన్నిరకాల ఎలర్జీలు తగ్గుతాయి.

      పాలల్లో సున్నం కలప కూడదు +  తీసుకొనరాదు.

      " ఆరోగ్యమే ..... మహా భాగ్యం "

      శ్రీ రాజీవ్ దీక్షిత్..

Collected and typed by: Ram Prasad Gaaru



Loving-Serving-Saving Cow-Bull (Nature asset) is nothing wrong
Vishnu@Goseva world 


     

No comments: