Friday, August 18, 2017

కొన్ని ముఖ్య విషయములుGwhm5

*రాజీవ్ దీక్షిత్ స్వదేశి చికిత్స*

  కొన్ని ముఖ్య విషయములు.

*భోజనము*....
  తూర్పు లేక ఉత్తర దిశల వైపు ముఖము చేసి భోజనము చేయ వలెను .
దక్షిణ వైపు ముఖము చేసి ఎప్పుడు కూడా భోజనము చేయ రాదు.

*నడక* ......

  నడుస్తూ , నిలబడి ఏ పని చేయ రాదు . మన శరీరం కూర్చోవడానికి , పడు కొనడానికి చాలా సౌకర్యంగా వున్నది .
నడస్తున్నప్పుడు రెండు కాళ్ళ మీద సమాన భారము వేయ వలెను . మొదట కాలి మడమ మోపి , తర్వాత పాదము మోపి , చివరగా కాలి వ్రేళ్ళను మోపి నడవ వలెను .

*పడక*......

    వీపు ( వెన్న పూస ) బలం కొరకు పడుకొను విధానము .... తల , వీపు , Hips , తొడలు , Heel , మొదలగు శరీర భాగాలన్నియు భూమి పైన వుండ వలెను .  Bamboo Mat or Grass Mat పైన పడుకొనవలెను .

# మధ్యాహ్న భోజనము తర్వాత కొద్ది సేపు కుడి వైపున , తర్వాత ఎడమ వైపున , తర్వాత వెల్ల కిల పడుకొన వలెను .

# రాత్రి కొద్ది సేపు మొదట ఎడమ వైపు , తర్వాత కుడి వైపు , తర్వాత వెల్ల కిల పడుకొన వలెను .

# ఎల్లప్పుడూ భూమి మీదనే పడుకొనవలెను .

# ఎల్లప్పుడూ కూర్చొనడము , చదువు కొనడము , భోజనము భూమి మీదనే చేయ వలెను .

#  *చివరగా భూమి మీదనే మరణించ వలెను* .

# స్త్రీ భూమి మీద ప్రసవించన యెడల , ఆ బిడ్డ చాలా ఆరోగ్య వంతుడుగా వుండును .

# శరీరంలో అనారోగ్యంగా కొద్ది , కొద్దిగ మొదలై , తర్వాత విశ్వ రూపం దాల్చును. *శరీరంను ఎల్లప్పుడు గమనిస్తూ వుండ వలెను*

# సృష్ఠిలో ఏ జంతువులకు Hospital , laboratory, doctor s లేరు. కాని జంతువులన్నియు ఆరోగ్యంగా వున్నాయి .

# మానవునికి అన్నియు వున్నాయి , కాని అనారోగ్యంగా వున్నాడు .

# వారంలో ఒక రోజు ఉప వాసం చేసిన , రోగ నిరోధక శక్తి పెరిగి , చాలా అనారోగ్య సమస్యలు తొలగి పోవును .

# *ఉప వాసం చేయు విధానము*....

1. రోజంతా వేడి నీళ్ళు త్రాగుతూ ఉప వాసం చేయడము *ఉత్తమమైన పద్దతి*.
 
           ( OR )

2. రెండవ పద్దతి ..
కేవలం పండ్లు + Raw Vegetables తో ఉపవాసం చేయడం .
ఈ పద్దతిలో Boiled Vegetables తిన రాదు . Boiled చేసిన vegetables లలో folic acids వుండవు. ఉపవాస సమయములో folic acids శరీరానికి ఎంతో అవసరం .
ఉపవాస సమయంలో ఉప్పుని వాడరాదు .

# *నీళ్ళు. ( Water )*....

      వర్షపు నీళ్ళు అమృతం మరియు శ్రేష్ఠమైనవి . వర్షపు నీళ్ళని సంవత్సర మంతా నిల్వ చేసిన , చెడి పోవు .
రాళ్ళు + సున్నంతో కట్టిన Tank లో నిల్వ చేసుకొన వచ్చును .
శ్రేష్ట మైన నీళ్ళు వరుస క్రమములో...
1. వర్షపు నీరు. 2. నది నీళ్ళు. 3. మంచు నీళ్ళు. 4 . బావి నీళ్ళు. 5. చెరువు నీళ్ళు.

వేసవిలో..... మట్టి పాత్ర నీళ్ళు.

వర్ష కాలంలో... రాగి పాత్ర నీళ్ళు.

చలి కాలంలో.. బంగారు లేక వెండి పాత్ర నీళ్ళు
శ్రేష్ఠమైనవి ...

శరీరంను శుద్ది చేయు గుణం నీళ్ళకు కలదు.

# Asthma , శ్వాస రోగాలకు , కఫ రోగాలకు వేడి నీళ్ళు శ్రేష్ఠం .

#  ఎల్లప్పుడూ తాజా పండ్ల రసం , పాలు , పెరుగు , మజ్జిగ , నిమ్మ రసం , ఉసరి కాయ రసం , శరబత్ లను త్రాగ వలెను.

# Avoid cool drinks. Plastic Bottles, plastic items.

     *శ్రీ రాజీవ్ దీక్షిత్*

---- రామ ప్రసాద్. పి

No comments: